పోలీసు శాఖ రెడీ.. మావోయిస్టులు అడవిని వీడండి : SP కోటిరెడ్డి

దిశ, మహబూబాబాద్ : నిషేధిత మావోయిస్టు పార్టీలో అగ్రనేతలతో సహా కిందిస్థాయి సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని, వీరికి పోలీస్ శాఖ తరఫున వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలోని గంగారాం మండలం మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హారిభూషన్ గుండెపోటుతో మరణించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. మావోయిస్టు […]

Update: 2021-06-23 04:51 GMT

దిశ, మహబూబాబాద్ : నిషేధిత మావోయిస్టు పార్టీలో అగ్రనేతలతో సహా కిందిస్థాయి సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని, వీరికి పోలీస్ శాఖ తరఫున వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలోని గంగారాం మండలం మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హారిభూషన్ గుండెపోటుతో మరణించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.

మావోయిస్టు పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్ రెడ్డి, దామోదర్, భద్రులు కరోనా వ్యాధితో బాధపడుతున్నారనే సమాచారం ఉందని చెప్పారు. పోలీసు శాఖ తరఫున వైద్యం అందిస్తామని, కావున కరోనా సోకిన మావోయిస్టులు అడవిని వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న నాగరికత సమాజంలో వెనుకబడిన సిద్ధాంతాలతో నష్టపోకూడదని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.

Tags:    

Similar News