చెట్లు కొట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి: అవంతి
దిశ, వెబ్ డెస్క్: చెట్లు కొట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి అని మంత్రి అవంతి శ్రీనివాస రావు అన్నారు. విశాఖలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస రావు, విజయ సాయి రెడ్డిలు సోమవారం హాజరయ్యారు. రోడ్డుకు ఇరు వైపులా, జిల్లాలో వెయ్యి పార్కుల్లో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. విశాఖ జిల్లాలో 25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశించారని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: చెట్లు కొట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పని సరి అని మంత్రి అవంతి శ్రీనివాస రావు అన్నారు. విశాఖలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస రావు, విజయ సాయి రెడ్డిలు సోమవారం హాజరయ్యారు. రోడ్డుకు ఇరు వైపులా, జిల్లాలో వెయ్యి పార్కుల్లో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. విశాఖ జిల్లాలో 25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ ఆదేశించారని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. గ్రీన్ బెల్ట్ పేరుతో 2021 నాటికి మొక్కల పెంపకం పూర్తి కావాలని చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో మొక్కలు నాటడం ఎంతైనా అవసరమని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.