ట్విట్టర్‌కు కేంద్రం చివరి హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ హ్యాండిల్స్‌కు బ్లూ టిక్ తొలగించడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి అవకాశముంది తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు నోడల్ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్ అధికారి వివరాలను […]

Update: 2021-06-05 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ హ్యాండిల్స్‌కు బ్లూ టిక్ తొలగించడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి అవకాశముంది తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు నోడల్ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్ అధికారి వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.

ఫేస్ బుక్, వాట్సాప్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నుడుచుకుంటుండగా.. ట్విట్టర్ మాత్రమే ససేమిరా అంటోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ట్వి్ట్టర్ ఆశ్రయించడంతో.. ట్విట్టర్, కేంద్రం మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో వెంకయ్య, మోహన్ భగవత్ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్ తొలగించడం, వెంటనే కేంద్రం నిబంధనలు అమలు చేయాల్సిందిగా ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News