ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు.. అవెక్కడెక్కడంటే
దిశ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.12,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల రూపు రేఖలు మార్చడం కోసం నిధులు కేటాయించింది. అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీలు ఏ ప్రాంతంలో పెట్టే ఆలోచనలో ఉందంటే… మచిలీపట్నం, అరకు, నరసరావుపేట, నంద్యాల, పులివెందుల, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, హిందూపురం, […]
దిశ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.12,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల రూపు రేఖలు మార్చడం కోసం నిధులు కేటాయించింది. అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీలు ఏ ప్రాంతంలో పెట్టే ఆలోచనలో ఉందంటే…
మచిలీపట్నం, అరకు, నరసరావుపేట, నంద్యాల, పులివెందుల, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అమలాపురం, నర్సాపురం, బాపట్ల, మార్కాపురం, చిత్తూరు, విజయనగరంలలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
ఈ జాబితాలో మార్కాపురం, పులివెందుల తప్పితే మిగిలిన 14 కూడా పార్లమెంట్ నియోజక వర్గాలుగా ఉన్నాయి. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అయితే ఈ 14 పార్లమెంట్ నియోజక వర్గాలు కూడా జిల్లాలు అవుతాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏదయినా జిల్లాలో మెడికల్ కాలేజీ లేకపోతే ఆ జిల్లాలో కొత్తగా కట్టే మెడికల్ కాలేజీ నిధుల్లో సగం నిధులు కేంద్రమే భరిస్తుంది.
కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో మెడికల్ కాలేజీలు తీసుకు రావడం వెనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం కూడా ఇదే అనిపిస్తోంది. ఆ లెక్క ప్రకారం ఈ 14 నియోజక వర్గాలు ఖచ్చితంగా కొత్తగా రాబోయే జిల్లాలు అని అర్థమవుతోంది. రాజంపేటలో కూడా మెడికల్ కాలేజీ రాబోతుంది కాబట్టి పులివెందుల జిల్లా అయ్యే అవకాశాలు లేనట్టేనని సమాచారం. ఇక మార్కాపురం కూడా జిల్లా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడు ఈ 15 జిల్లాలు వస్తే రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది.