నకిలీ డాక్టర్ల జాడ ఏదీ?
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సమాజంలోని నకిలీ డాక్టర్లను ఏరి వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఫేక్ డాక్టర్ల ఆగడాలు మించిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో గతంలో సుమారు 100 మంది అర్హతలేని వైద్యులు నర్సింగ్ హోంలు, క్లినిక్, హాస్పిటల్స్ నిర్వహిస్తున్నట్టు ఓ ప్రైవేట్ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వారు నిర్వహించే దవాఖాన్లకు పూర్తిస్థాయి విజిట్ చేసి ఆ వివరాలను అందచేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సమాజంలోని నకిలీ డాక్టర్లను ఏరి వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఫేక్ డాక్టర్ల ఆగడాలు మించిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో గతంలో సుమారు 100 మంది అర్హతలేని వైద్యులు నర్సింగ్ హోంలు, క్లినిక్, హాస్పిటల్స్ నిర్వహిస్తున్నట్టు ఓ ప్రైవేట్ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వారు నిర్వహించే దవాఖాన్లకు పూర్తిస్థాయి విజిట్ చేసి ఆ వివరాలను అందచేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు గతేడాది డిసెంబరు 11వ తేదీన మూడు జిల్లాల డీఎమ్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు.
అప్పట్లో పలు మీడియాల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది జరిగి పది నెలలు గడిచినా.. వైద్యారోగ్యశాఖ కనీసం ఒక్క డాక్టర్ ను కూడా పట్టుకోలేకపోవడం విచిత్రంగా ఉంది. ఈ విషయంలో గ్రేటర్ పరిధిలోని డీఎమ్హెచ్ఓలు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం రిపోర్టులు కూడా తయారు చేయలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో? అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వేవ్ లో అదే డాక్టర్లు కరోనా ట్రీట్మెంట్ పేరిట లక్షల రూపాయాలను దండుకున్నట్లు వైద్యారోగ్యశాఖలోని కొందరు అధికారులు అప్ ది రికార్డులో చెబుతున్నారు. ఇంత పెద్దస్థాయిలో నకిలీలను గుర్తించి, ఎందుకు పట్టుకోలేకపోయారనేది? ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు వాళ్లు దొరకలేదా? వదిలేశారా? అని ఆ డిపార్ట్మెంట్ లోనే కింది స్థాయి సిబ్బంది గుసగుసలాడుతున్నారు. మరికొందరు ప్రభుత్వ పెద్దలు నుంచి ఆఫీసర్లపై ఒత్తిడి కూడా తెచ్చినట్టు సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఉన్నతాధికారులు వారిపై యాక్షన్ తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ లోని సిబ్బంది చర్చించుకుంటున్నారు.
వైద్యారోగ్యశాఖకు డిసెంబరు లో వచ్చిన 100 మంది ఫేక్ డాక్టర్ల జాబితాలో అత్యధికంగా 52 మంది రంగారెడ్డి, ఏడుగురు హైదరాబాద్, 41 మంది మేడ్చల్ జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిలో ఏకంగా 80 శాతం మంది ఆర్ఎంపీలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఫేక్ డాక్టర్లపై పలు మీడియాల్లో పెత్త ఎత్తున కథనాలు రావడంతో వాళ్లంతా గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. టాస్క్ఫోర్సు టీంలను చిక్కకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని స్వయంగా అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ చర్యలో పడి ఈ ఫేక్ డాక్టర్ల ముచ్చటను వైద్యాధికారులు మరిచిపోయారు. దీంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని, నకిలీ డాక్టర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలతో పాటు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టులు కోరుతున్నారు. లేదంటే వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆ ఫేక్ వైద్యులను పట్టుకుంటారా? లేదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.