గర్భంతో ఉన్న నర్సును కోరిక తీర్చమన్న ప్రభుత్వ డాక్టర్..

దిశ, నారాయణఖేడ్: నర్సును లైంగికంగా, శారీరకంగా వేధించాడని నర్సు బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ఓ ట్రైనీ నర్సును లైంగికంగా వేధించాడని నర్సు బంధువులు గురువారం ఆసుపత్రిలోనే చితకబాదారు. బాచెపల్లి నాగనికుంట తండాకు చెందిన ఓ మహిళ ట్రైనీ నర్సు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసి తర్వాత నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రికి […]

Update: 2021-12-02 09:08 GMT

దిశ, నారాయణఖేడ్: నర్సును లైంగికంగా, శారీరకంగా వేధించాడని నర్సు బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ఓ ట్రైనీ నర్సును లైంగికంగా వేధించాడని నర్సు బంధువులు గురువారం ఆసుపత్రిలోనే చితకబాదారు. బాచెపల్లి నాగనికుంట తండాకు చెందిన ఓ మహిళ ట్రైనీ నర్సు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసి తర్వాత నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ చేస్తోంది.

ఈ క్రమంలో ఆసుపత్రికి సక్రమంగా రాకుండా సర్టిఫికెట్ కోసం వెళ్లిన నర్సుతో డాక్టర్ నర్సింగ్ చౌహాన్ అసభ్యకరంగా మాట్లాడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ‘నాకు ఏమిస్తావు’ అని ఆమెను వేధించాడని పేర్కొంటున్నారు. నర్సు సునీత ‘నేను నాలుగు నెలల గర్భవతినని చెప్పగా.. నీకు కడుపు కనబడలేదని డాక్టర్ చౌహన్ అన్నాడని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన నర్స్.. విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. దీంతో గురువారం కుటుంబీకులు, బంధువులకు తెలపడంతో డాక్టర్ పై దాడి చేశారు.

కాగా, ఈ డాక్టర్ తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిలో ఓ యువతితో రాసలీలలు జరిపినట్లు పుకార్లు వచ్చాయి. అదేవిధంగా సర్టిఫికెట్ల కోసం వచ్చే నర్సింగ్ విద్యార్థుల వద్ద లంచాలు తీసుకోవడంతో డాక్టర్ బాగోతం బయటపడి అభాసుపాలు అయ్యాడు. ఇటీవల మంత్రి హరీష్ రావు చేసిన ఆకస్మిక తనిఖీలో స్థానికులు డాక్టర్ పై ఫిర్యాదులు చేశారు. ఇటువంటి డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డాక్టర్ నర్సింగ్ చౌహాన్ను వివరణ కోరగా డ్యూటీకి సక్రమంగా రావాలని ఆదేశించడంతో తనపై కావాలని కక్షకట్టి దాడికి దిగారని ఆరోపించారు. ఈ విషయంపై ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌంటర్ కేసులు నమోదయ్యాయి. బాధితురాలు, డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News