జీపీఎఫ్ వడ్డీ రేట్లలో కోత!
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), ఇతర ఫండ్‌లపై వడ్డీ రేట్లను తగ్గించింది. జీపీఎఫ్ వడ్డీని 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్ల కోత వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. జీపీఎఫ్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ స్కీమ్. ఉద్యోగుల జీతంలో 15 శాతం వరకూ ఈ స్కీమ్ కోసం కంట్రిబ్యూట్ […]
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), ఇతర ఫండ్‌లపై వడ్డీ రేట్లను తగ్గించింది. జీపీఎఫ్ వడ్డీని 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్ల కోత వర్తిస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం ఉండనుంది. జీపీఎఫ్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ స్కీమ్. ఉద్యోగుల జీతంలో 15 శాతం వరకూ ఈ స్కీమ్ కోసం కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద వడ్డీ లేని రుణాలను అందుకోవచ్చు.
కేంద్రం ఇటీవల స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను 1.4 శాతం తగ్గించింది. ఇందులో భాగంగానే కొత్తగా జీపీఎఫ్ వడ్డీ రేట్ల కోత విధించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటును కూడా 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. జీపీఎఫ్ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(డిఫెన్స్), స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్మ్‌డ్ ఫొర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి వాటిపై సైతం దీని ప్రభావం ఉండనుంది.
ఆర్‌బీఐ మార్చి నెల ఆఖరులో కీలకమైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లాక్‌డౌన్ వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని ప్రకటీంచింది.
Tags : General Provident Fund, GPF interest rate, GPF, finance ministry