ప్రభుత్వ భూమి మాయం..ప్రైవేట్‌లో ప్రత్యక్షం
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మాయంటే, మాయ… భూమాయ. దేశంలో కాస్త పలుకుబడి ఉంటే ఏదైన జరుగుతుందడానికి ఇదో ఉదాహరణ. ఏకంగా సీలింగ్ భూమిని పట్టా భూమిగా మార్చిన అధికారులు..సీలింగ్ భూముల విస్తీర్ణంలో తేడా రావటంతో, నాలుక కరుచుకుని అమాయకుల పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చి చేతులు దులుపుకున్నారు.వివరాలు..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామంలోని పలువురి రైతుల పట్టా భూమిని సీలింగ్ భూమిగా స్ధానిక తహశీల్ధార్లు మార్పు చేశారు. గ్రామంలో నక్క అంజయ్య తండ్రి రాములుకు […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మాయంటే, మాయ… భూమాయ. దేశంలో కాస్త పలుకుబడి ఉంటే ఏదైన జరుగుతుందడానికి ఇదో ఉదాహరణ. ఏకంగా సీలింగ్ భూమిని పట్టా భూమిగా మార్చిన అధికారులు..సీలింగ్ భూముల విస్తీర్ణంలో తేడా రావటంతో, నాలుక కరుచుకుని అమాయకుల పట్టా భూమిని సీలింగ్ భూమిగా మార్చి చేతులు దులుపుకున్నారు.వివరాలు..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామంలోని పలువురి రైతుల పట్టా భూమిని సీలింగ్ భూమిగా స్ధానిక తహశీల్ధార్లు మార్పు చేశారు. గ్రామంలో నక్క అంజయ్య తండ్రి రాములుకు సర్వే నెం.550లో 5 ఎకరాలు, నక్క రాములమ్మ భర్త అంజయ్యకు సర్వే నెం. 542లో 5 ఎకరాలు కలిపి మొత్తం 10 ఎకరాల సీలింగ్ భూమి ఉంది.
అయితే ఈ భూమిని 2007 సంవత్సరంలో అతని పరపతి ఉపయోగించి సీలింగ్ భూమిని పట్టాదారుడిగా రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకున్నారు. ఈ సీలింగ్ భూమిని రికార్డుల్లో సరిచేసేందుకుగాను పట్టాదారుల భూమిని సీలింగ్ భూమిగా చూపిస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికారులు. బాధితులు గట్టిగా నిలదీస్తే స్ధానిక తహశీల్ధార్ లిఖితపూర్వకంగా బాధితుల సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణం, సీలీంగ్ భూమి కాదని, పట్టాభూమిగా రెవెన్యూ శాఖ గుర్తిస్తుందని అధికారిక ముద్ర వేసిన పత్రం ఇచ్చారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవటంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ చుక్కెదురవటంతో దీక్షలకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 3వ తేదీన స్ధానిక తహశీల్ధార్ కార్యాలయం వద్ద బాధితులు దీక్షకు దిగుతున్నట్లు తహశీల్ధార్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు.సీలింగ్, ఖరీదు చేసిన భూములు ఒకే సర్వే నెంబర్ కావడంతో రైతులను మోసం చేయటం సులువైనట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ భూములు భూస్వామి కర్నాటి కృష్ణారెడ్డి కుటుంబానివి. భూ గరిష్ట పరిమితి చట్టం వల్ల కొంత భూమి ప్రభుత్వానికి సంక్రమించింది. మరికొంత భూమిని స్థానిక రైతుల కొనుగోలు చేశారు. వారిలో గోవిందు మల్లయ్య, వెంకటయ్య, ఎక్కువపల్లి పెద్ద జంగయ్య, చిన్న రామయ్య లు 1970వ సంవత్సరంలో భూమిని కొనుగోలు చేసుకొని రికార్డులో నమోదు చేసుకున్నారు. ఇదే కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన భూమిలో నక్క రాములు కుటుంబం కౌలుదారుడిగా పనిచేస్తూ వస్తున్నారు. అప్పట్లో సీలింగ్ యాక్డ్ ప్రకారం సదురు రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూమిని కౌలు చేసుకుంటున్న రైతులకు ఇవ్వటం జరిగింది. దాంతో అధికారులను ప్రలోభాలకు గురిచేసి గతంలో సీలింగ్ భూమిని పట్టాభూమికి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను బాధితులు ఇప్పటికే అధికారులకు ఇవ్వటం జరిగింది.