రైతుల నెత్తిన రాయితీ పిడుగు
దిశ, మెదక్: వరి విత్తనాల కొనుగోళ్లలో రైతులకు ఇస్తున్న రాయితీ తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులపై కోటి రుపాయల అదనపు భారం పడనుంది. సర్కార్ గతేడాది రైతులను ఆదుకునేందుకు విత్తనాల కొనుగోలుపై రాయితీని ఇచ్చింది. కిలో వరి విత్తనానికి రు .5 చొప్పున రాయితీ ఇవ్వగా ఈ ఏడాది ఆ సబ్సిడీ తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,30,000 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ […]
దిశ, మెదక్: వరి విత్తనాల కొనుగోళ్లలో రైతులకు ఇస్తున్న రాయితీ తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులపై కోటి రుపాయల అదనపు భారం పడనుంది. సర్కార్ గతేడాది రైతులను ఆదుకునేందుకు విత్తనాల కొనుగోలుపై రాయితీని ఇచ్చింది. కిలో వరి విత్తనానికి రు .5 చొప్పున రాయితీ ఇవ్వగా ఈ ఏడాది ఆ సబ్సిడీ తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,30,000 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా రూపొందించింది. ఇందుకోసం 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కిలో వరి విత్తనాలకు రూ.100 నుంచి రూ.120 వరకు వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన 20 వేల క్వింటాళ్లకు కోటి రూపాయలు రైతులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.