సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ షాక్..

తిరువనంతపురం: కేరళ‌లోని పినరయి విజయన్ సర్కార్‌కు గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కోసం రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయించింది. బుధవారం ప్రత్యేక సమావేశానికి అనుమతించాలని కోరుతూ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కానీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ అనుమతి నిరాకరించారు. ఈ విషయమై కేరళ సర్కారు తీవ్రంగా స్పందించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర క్యాబినెట్ […]

Update: 2020-12-22 09:34 GMT

తిరువనంతపురం: కేరళ‌లోని పినరయి విజయన్ సర్కార్‌కు గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కోసం రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయించింది. బుధవారం ప్రత్యేక సమావేశానికి అనుమతించాలని కోరుతూ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది.

కానీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ అనుమతి నిరాకరించారు. ఈ విషయమై కేరళ సర్కారు తీవ్రంగా స్పందించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.

Tags:    

Similar News