వికలాంగుల బంధు ప్రకటించాలి- వికలాంగుల సంఘం

దిశ, ములుగు : రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రకటించినట్లే, వికలాంగుల బంధు ప్రకటించాలని వికలాంగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ఆధ్వర్యంలో వి హెచ్ పి ఎస్ జెండా ఆవిష్కరించారు. జిల్లాలో డీబ్ల్యూఓ అధికారిణి వికలాంగుల సంఘాలను విచారించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ […]

Update: 2021-08-28 08:51 GMT

దిశ, ములుగు : రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రకటించినట్లే, వికలాంగుల బంధు ప్రకటించాలని వికలాంగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ఆధ్వర్యంలో వి హెచ్ పి ఎస్ జెండా ఆవిష్కరించారు. జిల్లాలో డీబ్ల్యూఓ అధికారిణి వికలాంగుల సంఘాలను విచారించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News