హమ్ చేస్తే.. పాట వెతికే పెట్టే గూగుల్ ఫీచర్

దిశ, వెబ్‌డెస్క్: సంగీతాన్ని మనుషులే కాదు.. మూగజీవాలు కూడా ఆస్వాదిస్తాయి. ఇక కొందరు సంగీతప్రియులు పాటలు వింటూ ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అయితే, కొన్నిసార్లు మనకు పాట ట్యూన్ గుర్తుంటుంది కానీ.. ఆ పాటకు సంబంధించిన సాకి లేదా పల్లవి గుర్తు రాదు. కనీసం ఆ పాట సినిమా పేరు కూడా గుర్తురాదు. ఇంకొన్నిసార్లు ఎఫ్ఎం లేదా టీవీలో ప్లే అవుతున్న పాట పూర్తయ్యే టైమ్‌లో వింటుంటాం.. ఆ పాట ఏంటో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతాం. కానీ తెలిసేదెలా? […]

Update: 2020-10-17 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంగీతాన్ని మనుషులే కాదు.. మూగజీవాలు కూడా ఆస్వాదిస్తాయి. ఇక కొందరు సంగీతప్రియులు పాటలు వింటూ ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అయితే, కొన్నిసార్లు మనకు పాట ట్యూన్ గుర్తుంటుంది కానీ.. ఆ పాటకు సంబంధించిన సాకి లేదా పల్లవి గుర్తు రాదు. కనీసం ఆ పాట సినిమా పేరు కూడా గుర్తురాదు. ఇంకొన్నిసార్లు ఎఫ్ఎం లేదా టీవీలో ప్లే అవుతున్న పాట పూర్తయ్యే టైమ్‌లో వింటుంటాం.. ఆ పాట ఏంటో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతాం. కానీ తెలిసేదెలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా తాజాగా గూగుల్ ‘హమ్ టూ సెర్చ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గూగుల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు న్యూ అప్‌డేట్స్ పరిచయం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘హమ్ టూ సెర్చ్’ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. మన గొంతులో ఆగిపోయిన పాటను గుర్తుచేసుకునేందుకు ఉపయోగపడేలా గూగుల్ దీన్ని రూపొందించింది. ఇందుకోసం 10-15 సెకన్ల పాటు హమ్ చేస్తే చాలు.. ఆ పాటకు సంబంధించిన లిరిక్స్ మన ముందు కనిపిస్తాయి.

హమ్ టూ సెర్చ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం కోసం లేటెస్ట్ వెర్షన్ గూగుల్ యాప్‌ను కలిగి ఉండాలి. సెర్చ్ టూల్స్ సెక్షన్‌లో ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా మనం పాడిన పాట ఏంటనేది అది గుర్తిస్తుంది. గూగుల్ సెర్చ్‌ మైక్‌లో ‘వాట్స్ ద సాంగ్’ లేదా ‘సెర్చ్ ఏ సాంగ్’ అనే బటన్‌పై ట్యాప్ చేస్తే చాలు.. నచ్చిన పాటకు సంబంధించి మ్యాచింగ్ లింకులను వెతికి స్క్రీన్ మీద చూపెడుతుంది. హ్యుమన్స్ సింగింగ్, విజిలింగ్ లేదా హుమ్మింగ్ వంటి సంకేతాలను కూడా ఈ ఫీచర్ సులభంగా అర్థం చేసుకోగలదు. గూగుల్ అందిస్తున్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో 20 భాషలకు పైగా అందుబాటులో ఉండగా.. ఐవోఎస్ డివైజ్‌లో మాత్రం కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది. అందులో కూడా త్వరలోనే మరిన్ని భాషల్లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ క్రిష్ణ కుమార్ వెల్లడించాడు.

Tags:    

Similar News