ఎక్స్‌పెడిషన్స్ యాప్‌కు గూగుల్ గుడ్ బై!
దిశ, వెబ్‌డెస్క్: వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఆ దిశగా పెట్టుబడులు మొదలుపెట్టాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా విద్యార్థుల కోసం వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్ అందించడంలో భాగంగా ఎక్స్‌పెడిషన్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్లి మరీ సుదూర ప్రదేశాలను సందర్శించి అప్పటి సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరుండి అనుభూతి చెందే అవకాశం కలుగుతుంది. అటు ఎడ్యుకేటర్‌లకు, ఇటు విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం […]
దిశ, వెబ్‌డెస్క్: వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఆ దిశగా పెట్టుబడులు మొదలుపెట్టాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా విద్యార్థుల కోసం వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్ అందించడంలో భాగంగా ఎక్స్‌పెడిషన్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్లి మరీ సుదూర ప్రదేశాలను సందర్శించి అప్పటి సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరుండి అనుభూతి చెందే అవకాశం కలుగుతుంది. అటు ఎడ్యుకేటర్‌లకు, ఇటు విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం కల్పించిన ఈ ఎక్స్‌పెడిషన్స్ యాప్‌కు త్వరలో గుడ్ బై చెప్పనున్నట్లు గూగుల్ ప్రకటించింది. జూన్ 30, 2021 నుంచి ఈ ఎక్స్‌పెడిషన్స్ యాప్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు వెల్లడించింది.
2015లో ఈ ఎక్స్‌పెడిషన్స్ ప్రోగ్రామ్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. తర్వాత సంవత్సరానికి ఎడ్యుకేటర్‌లకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా దీని అమ్మకాలను మొదలుపెట్టింది. ఈ రకంగా వర్చువల్ రియాలిటీ టూర్‌లను రూపొందించింది. అయితే ఎక్స్‌పెడిషన్స్ యాప్‌ను పూర్తిగా తొలగించిన తర్వాత ఇందులో ఇప్పటికే ఉన్న ఎక్స్‌పెడిషన్ టూర్‌లను గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌కు తరలించనున్నారు. అంటే ఇన్నాళ్లు ఎక్స్‌పెడిషన్స్ అందించిన సేవలన్నీ గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో భాగం కానున్నాయి. అయితే ఎక్స్‌పెడిషన్స్ యాప్ ద్వారా అందాలనుకున్న సేవలు, అందాల్సిన వారికి అందడం లేదని అందుకే దీన్ని పూర్తిగా ఆర్ట్స్ అండ్ కల్చర్‌కు తరలిస్తున్నట్లు గూగుల్ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.