8 లక్షల యాప్‌లపై గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో పిక్సలేట్ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్ వంటి వాటి ద్వారా […]
దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో పిక్సలేట్ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్ వంటి వాటి ద్వారా యూజర్ డేటాను సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.
వీటిలో 86 శాతం యాప్‌లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో వెల్లడించింది. నిషేధిత యాప్‌ల జాబితాను రూపొందించే ముందు ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లలో సుమారు 5 మిలియన్ యాప్‌లను విశ్లేషించినట్లు పిక్సలేట్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నిషేధిత యాప్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ తెలిపింది. యాపిల్ యాప్‌స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ ఈ యాప్‌లు యూజర్ల ఫోన్లలో ఉంటున్నాయని పిక్సలేట్ వ్యక్తం చేసింది. యూజర్స్ వెంటనే వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేయాలని హెచ్చరించింది.