GooglePay బంపర్ ఆఫర్… ఇలా చేస్తే రూ.600 మీవే

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో ప్రజలంతా ఆన్‌లైన్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో UPI పేమెంట్స్ యాప్స్‌పై ఆధారపడాల్సి వచ్చింది. మార్కెట్‌లో అధికంగా వినియోగంలో ఉన్న యాప్స్‌లో.. GooglePay, PhonePay, Paytm, BharathPayలు ముందువరుసలో ఉన్నాయి. అయితే, వినియోగదారులను ఆకర్షించేందకు GooglePay స్క్రాచ్ కార్డులను తీసుకొచ్చి క్యాష్ బ్యాక్ ఆఫర్లు తెచ్చింది. దీంతో చాలామంది ఈ యాప్‌ను వాడుతున్నారు. కానీ, కొద్ది రోజులకే స్క్రాచ్ కార్డుల్లో ‘బెటర్ లక్ నెక్స్ట్ […]

Update: 2021-10-23 08:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో ప్రజలంతా ఆన్‌లైన్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో UPI పేమెంట్స్ యాప్స్‌పై ఆధారపడాల్సి వచ్చింది. మార్కెట్‌లో అధికంగా వినియోగంలో ఉన్న యాప్స్‌లో.. GooglePay, PhonePay, Paytm, BharathPayలు ముందువరుసలో ఉన్నాయి. అయితే, వినియోగదారులను ఆకర్షించేందకు GooglePay స్క్రాచ్ కార్డులను తీసుకొచ్చి క్యాష్ బ్యాక్ ఆఫర్లు తెచ్చింది.

దీంతో చాలామంది ఈ యాప్‌ను వాడుతున్నారు. కానీ, కొద్ది రోజులకే స్క్రాచ్ కార్డుల్లో ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అని నిరాశ చూపి, ఏదో ఓ కంపెనీకి చెందిన ఆఫర్స్ ఇస్తోంది. ఇక యూజర్లకు ఇంట్రెస్ట్ పోతోందన్న సమయానికి GooglePay మరో భారీ స్కెచ్ వేసింది. క్రికెట్ ప్రియులను ఆకర్షించేలా ఓ స్క్రాచ్ కార్డు గేమ్(FanWallOffer) ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో 6 పేమెంట్స్ చేస్తే ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. దీనిని స్క్రాచ్ చేస్తే రూ.600 వరకూ గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేసేయండి.

Tags:    

Similar News