క్రేజీ ఆఫర్స్: స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ చైనా మొబైల్​ఫోన్ల తయారీ దిగ్గజం షియోమి సంస్థ.. సరికొత్త ఫీచర్లతో ఎంఐ 11X సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, తొలిసారి స్నాప్‌డ్రాగ్ 888 ప్రాసెసర్‌తో రూపొందించిన ఎంఐ 11 సిరీస్ ఫోన్లను.. డిసెంబర్ 28వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి ప్రతినిథులు తెలిపారు. కాస్త ఖరీదు ఎక్కువైనా మంచి ఫీచర్లు ఉన్న షావోమీ MI 11X 5జీ […]

Update: 2021-08-06 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ చైనా మొబైల్​ఫోన్ల తయారీ దిగ్గజం షియోమి సంస్థ.. సరికొత్త ఫీచర్లతో ఎంఐ 11X సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, తొలిసారి స్నాప్‌డ్రాగ్ 888 ప్రాసెసర్‌తో రూపొందించిన ఎంఐ 11 సిరీస్ ఫోన్లను.. డిసెంబర్ 28వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు షియోమి ప్రతినిథులు తెలిపారు. కాస్త ఖరీదు ఎక్కువైనా మంచి ఫీచర్లు ఉన్న షావోమీ MI 11X 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఏకంగా రూ.7,000 డిస్కౌంట్‌తో అమెజాన్‌లో భారీ ఆఫర్స్ అందిస్తోంది.

ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

1. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఎంఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,000 డిస్కౌంట్‌తో కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్ రూ.7,000 తక్కువ ధరకే లభిస్తోంది.
2. ఎంఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై SBI కార్డుతో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.7,000 డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంది.
3. MI 11X 5జీ ధర చూస్తే 6 జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.29,999. ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌తో 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు పొందవచ్చు.
4. MI 11X 5జీ డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌ హెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది.
5. MI 11X 5జీ ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870
6. MI 11X 5జీ కెమెరా: 48మెగాపిక్సెల్ Sony IMX582 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
7. ఎంఐ 11ఎక్స్ 5జీ ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్.
8. MI 11X 5జీ బ్యాటరీ: 4,520ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 2.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
9. MI 11X 5జీ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.
11. ఎంఐ 11ఎక్స్ 5జీ సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ సపోర్ట్‌తో పాటు అనేక ఫీచర్లు, ఆఫర్లు ఉన్నాయి.

Tags:    

Similar News