తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులైన పట్టభద్రులకు ‘నిరుద్యోగ భృతి’ని ఇవ్వాలని తమ టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చిందని, గతేడాది అమలు చేయాలని భావించామని, అయితే కరోనా కారణంగా సాధ్యం కాలేదని కేసీఆర్ వివరించారు. ఇచ్చిన హామీని త్వరలోనే అమలులోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విది విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పంతోనే వివిధ రాష్ట్రాల్లో ఆ పథకం అమలవుతున్న తీరుపై […]

Update: 2021-03-26 05:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులైన పట్టభద్రులకు ‘నిరుద్యోగ భృతి’ని ఇవ్వాలని తమ టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చిందని, గతేడాది అమలు చేయాలని భావించామని, అయితే కరోనా కారణంగా సాధ్యం కాలేదని కేసీఆర్ వివరించారు. ఇచ్చిన హామీని త్వరలోనే అమలులోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విది విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న సంకల్పంతోనే వివిధ రాష్ట్రాల్లో ఆ పథకం అమలవుతున్న తీరుపై అధికారులు అధ్యయనం చేశారని, నిర్ణయం తీసుకునే సమయానికి కరోనా వచ్చిపడిందన్నారు. హాస్టల్, మెస్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

 

Tags:    

Similar News