తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఇటీవల శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఉభయ సభల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపారు. శనివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో […]

Update: 2021-03-27 09:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఇటీవల శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఉభయ సభల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపారు.

శనివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు చేరింది. ఇప్పటి వరకు ఈ వయస్సు 58 ఏండ్లుగా ఉండేది. ఈ నెల నుంచే వయో పరిమితి పెంపు వర్తించనుంది.

 

Tags:    

Similar News