గోలికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి: దారమోని
దిశ, కల్వకుర్తి: మలి దశ తెలంగాణ ఉద్యమంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గత 14 సంవత్సరాల నుంచి పార్టీలో ఎలాంటి పదవులు లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు, రాష్ట్ర యువతకు క్రీడారంగంలో అనేక పోటీలు నిర్వహిస్తూ, నిరుపేద విద్యార్థుల చదువులకు చేయూతనందించడంతోపాటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ కోరారు. […]
దిశ, కల్వకుర్తి: మలి దశ తెలంగాణ ఉద్యమంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గత 14 సంవత్సరాల నుంచి పార్టీలో ఎలాంటి పదవులు లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు, రాష్ట్ర యువతకు క్రీడారంగంలో అనేక పోటీలు నిర్వహిస్తూ, నిరుపేద విద్యార్థుల చదువులకు చేయూతనందించడంతోపాటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్తున్న గోలి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ కోరారు. నియోజకవర్గంతోపాటూ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాలు పంచుకుంటూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి టీఆర్ఎస్ పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేసిన నిఖార్సయిన నేత గోలి శ్రీనివాస్ రెడ్డి అని దారమోని గణేష్ కొనియాడారు.