వృద్ధి అంచనాలను తగ్గించిన గోల్డ్‌మన్ శాక్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి 11.7 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉండటం, పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా సవరించినట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వల్ల అనేక సంస్థలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను డిమాండ్ చేస్తున్నాయని అభిప్రాయపడింది. గతేడాది ఇదే సమయంలో కేంద్రం సరైన వ్యూహంతో అనుసరించింది. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక వృద్ధి 11.7 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉండటం, పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా సవరించినట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వల్ల అనేక సంస్థలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను డిమాండ్ చేస్తున్నాయని అభిప్రాయపడింది. గతేడాది ఇదే సమయంలో కేంద్రం సరైన వ్యూహంతో అనుసరించింది. అయితే ఈసారి లాక్‌డౌన్ ఆంక్షలు విధించే అధికారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. అనేక రాష్ట్రాలు నగరాల్లో ఆంక్షలు విధించాయి. దీనివల్ల గతేడాదితో పోలిస్తే ప్రతికూల ప్రభావం తక్కువగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక తెలిపింది. అయితే ఈ-వే బిల్లులు, సరుకుల సరఫరా, మొబిలిటీ, కార్గో ట్రాఫిక్ సహా సేవల రంగంలో క్షీణత కనిపిస్తోంది. ఈ కారణంగానే జీడీపీ అంచనాలను తగ్గించేందుకు దారి తీసినట్టు నివేదిక వివరించింది.
సెప్టెంబర్ త్రైమాసికం నాటికి కార్యకలాపాలు వేగంగా పుంజుకునే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11.1 శాతానికి తగ్గిస్తూ, ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 10.5 నుంచి 9.7 శాతానికి అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో రాబోయే నెలల్లో టీకా పంపిణీ వేగవంతం అవుతుందని భావిస్తున్నట్టు గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది.