శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూణె నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 6 బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు […]

Update: 2021-02-22 23:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూణె నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 6 బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News