పడిపోతున్న బంగారం ధరలు
దిశ వెబ్‌డెస్క్: పసిడి ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. రోజురోజుకి తగ్గుతూ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, యూఎస్ డాలర్ పెరగడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయుని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇవాళ ఎంసీక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 230 తగ్గి రూ.44,311కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఎంసీక్స్‌లో రూ.476 తగ్గి రూ.65,455కి చేరుకుంది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా […]
దిశ వెబ్‌డెస్క్: పసిడి ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. రోజురోజుకి తగ్గుతూ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, యూఎస్ డాలర్ పెరగడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయుని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.
ఇవాళ ఎంసీక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 230 తగ్గి రూ.44,311కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఎంసీక్స్‌లో రూ.476 తగ్గి రూ.65,455కి చేరుకుంది.
రానున్న రోజుల్లో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌లో ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ నష్టాల పాలవ్వడంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బంగారం ధర రూ.50 వేల మార్క్‌కి చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి