గోల్డ్ రేటు టూ మచ్.. మరీ ఇంతనా!

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా ప్రభావంతో 10 గ్రాముల బంగారం రూ. 50 వేలు దాటింది. ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అషాఢమాసంలో ధర తగ్గుతుందని భావించిన పసిడి ప్రియులకు.. కొనాలన్న ఆలోచన కూడా రాకుండా చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్స్ 10 గ్రాములు గోల్డ్ రూ. 50,950గా ఉండగా.. 22 క్యారెట్ ధర రూ. 46,740గా ఉంది. […]

Update: 2020-07-01 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా ప్రభావంతో 10 గ్రాముల బంగారం రూ. 50 వేలు దాటింది. ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అషాఢమాసంలో ధర తగ్గుతుందని భావించిన పసిడి ప్రియులకు.. కొనాలన్న ఆలోచన కూడా రాకుండా చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్స్ 10 గ్రాములు గోల్డ్ రూ. 50,950గా ఉండగా.. 22 క్యారెట్ ధర రూ. 46,740గా ఉంది. దేశ రాజధానిలో ఏమాత్రం తీసుపోకుండా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 48,750 ఉండగా.. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం 47,550గా ఉంది. దీంతో బంగారాన్ని కొనాలంటే జనం భయపడుతున్నారు.

Tags:    

Similar News