దిగొచ్చిన బంగారం!

దిశ, వెబ్‌డెస్క్: బంగారం మళ్లీ దిగొచ్చింది. గత వారం రోజులుగా కరోనా వైరస్ కారణంగా మార్కెట్లు నష్టపోతూండటంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. గురువారం మార్కెట్లు భారీగా కుప్పకూలడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడటం వంటి కారణాలతో కమొడిటీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరుకుంది. ఇంతకుముందు సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.43,697గా ఉండేది. బంగారం బాటలోనే వెండి కూడా కిలో రూ.1574 వరకూ […]

Update: 2020-03-13 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగారం మళ్లీ దిగొచ్చింది. గత వారం రోజులుగా కరోనా వైరస్ కారణంగా మార్కెట్లు నష్టపోతూండటంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. గురువారం మార్కెట్లు భారీగా కుప్పకూలడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడటం వంటి కారణాలతో కమొడిటీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరుకుంది. ఇంతకుముందు సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.43,697గా ఉండేది. బంగారం బాటలోనే వెండి కూడా కిలో రూ.1574 వరకూ తగ్గి రూ. 44,130గా నమోదైంది.
ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో 45 నిమిషాల పాటు క్లోజాయిన అనంతరం ఆర్‌బీఐ ద్రవ్య లభ్యత విషయంలో జోక్యం చేసుకోవడంతో రూపాయికి బలమొచ్చింది. ఈ పరిణామాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడింది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించాయి. ప్రయాణాలు తగ్గించాలని, ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పాయి. అనేక దేశాల మార్కెట్లు మందగమనంలో పయనిస్తుండటంతో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,584 డాలర్లు ఉండగా .. వెండి ధర 15.65 డాలర్లు ఉంది.

Tags: Gold price, commidities, Gold price in Delhi

Tags:    

Similar News