బంగారం దిగుమతులపై కరోనా ఒత్తిడి!

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశీయంగా బంగారానికి డిమాండ్ పూర్తీగా దిగజారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో మార్చి నెలలో బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. అత్యధికంగా బంగారం వినియోగించే రెండో అతిపెద్ద దేశమైన ఇండియా మార్చి నెలలో 63 శాతం తక్కువ దిగుమతి చేసుకుంది. గతేడాది మార్చి నెలలో 93.24 టన్నుల దిగుమతులు అవగా, ఈ ఏడాది మర్చి నెలలో కేవలం 25 టన్నుల బంగారం దిగుమతి అవడం గమనార్హం. మార్చిలో దిగుమతులు దాదాపు […]

Update: 2020-04-06 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశీయంగా బంగారానికి డిమాండ్ పూర్తీగా దిగజారింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో మార్చి నెలలో బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. అత్యధికంగా బంగారం వినియోగించే రెండో అతిపెద్ద దేశమైన ఇండియా మార్చి నెలలో 63 శాతం తక్కువ దిగుమతి చేసుకుంది. గతేడాది మార్చి నెలలో 93.24 టన్నుల దిగుమతులు అవగా, ఈ ఏడాది మర్చి నెలలో కేవలం 25 టన్నుల బంగారం దిగుమతి అవడం గమనార్హం.

మార్చిలో దిగుమతులు దాదాపు 63 శాతం పడిపోయి రూ. 9.15 వేల కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో దేశీయంగా ధరల పెరుగుదల డిమాండ్‌ను తగ్గించడంతో బంగారం దిగుమతులు 41 శాతం పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇండియా 77.64 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరికి 46 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోగలిగింది.

ఇండియాలో కరోనా వైరస్ కేసులను నియంత్రించడానికి ప్రభుత్వం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ పరిణామాలు ఈక్విటీ, కమొడిటీ, బులియన్ మార్కెట్లలో మదుపర్లు సెంటమెంటి దెబ్బతిని పెట్టుబడుల పతనానికి దారితీశింది. అయితే, 2020 బడ్జెట్‌లో కేంద్రం బంగారు నాణెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం కూడా బంగారం దిగుమతులు తగ్గడంపై ప్రభావం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: Gold Imports, Yellow Metal, Domestic Prices, Coronavirus Lockdown, Coronavirus Cases

Tags:    

Similar News