చేపలు పట్టడానికి వెళ్లి.. గోదావరిలో వ్యక్తి గల్లంతు..

దిశ, భద్రాచలం : చర్ల మండల పరిథిలోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన సంకపాప కనకయ్య (70) ఆదివారం ఉదయం సమీపంలోని గోదావరిలో గల్లంతైనాడు. చేపల వేట కోసం వల పట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిన కనకయ్య, ఇలా నీటిలో గల్లంతవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చేపల కోసం నీటిలో వలవేసి అది చిక్కుకోవడంతో లోతు నీటిలోకి దిగాడని, అది గమనించిన సమీపంలోని పశువుల కాపరులు నీటిలోకి దిగవద్దని అరుచుకుంటూ పరుగెత్తుకొచ్చే లోగానే కనకయ్య గల్లంతు అయినట్లు ప్రాథమిక […]

Update: 2021-09-05 05:32 GMT

దిశ, భద్రాచలం : చర్ల మండల పరిథిలోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన సంకపాప కనకయ్య (70) ఆదివారం ఉదయం సమీపంలోని గోదావరిలో గల్లంతైనాడు. చేపల వేట కోసం వల పట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిన కనకయ్య, ఇలా నీటిలో గల్లంతవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చేపల కోసం నీటిలో వలవేసి అది చిక్కుకోవడంతో లోతు నీటిలోకి దిగాడని, అది గమనించిన సమీపంలోని పశువుల కాపరులు నీటిలోకి దిగవద్దని అరుచుకుంటూ పరుగెత్తుకొచ్చే లోగానే కనకయ్య గల్లంతు అయినట్లు ప్రాథమిక సమాచారం.

గోదావరి, తాలిపేరు కలిసే ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గోదావరి చెంతకు పరుగెత్తుకొచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గజ ఈతగాళ్ళు, జాలర్లు పడవులు వేసుకొని గాలిస్తున్నారు. కనకయ్య గల్లంతుపై పోలీసులకు సమాచారం అందించారు.

Tags:    

Similar News