సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభవార్త!
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాల్లో త్వరలో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. చిన్నకోడూరు మండలం చందులాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్టు సర్జ్ పూల్ లోకి అనంతగిరి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. 60 మీటర్ల సర్జిపూల్‌లో ఇప్పటికే 30 మీటర్ల వరకు నీళ్లు వచ్చి చేరాయి. సర్జ్‌పూల్‌లోని గోదావరి జలాలను రంగనాయక సాగర్ ప్రాజెక్టులో పంపింగ్ చేసేందుకు 135 మెగావాట్ల సామర్థ్యం గల 4 విద్యుత్ మోటార్లను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం […]
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాల్లో త్వరలో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. చిన్నకోడూరు మండలం చందులాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్టు సర్జ్ పూల్ లోకి అనంతగిరి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. 60 మీటర్ల సర్జిపూల్‌లో ఇప్పటికే 30 మీటర్ల వరకు నీళ్లు వచ్చి చేరాయి. సర్జ్‌పూల్‌లోని గోదావరి జలాలను రంగనాయక సాగర్ ప్రాజెక్టులో పంపింగ్ చేసేందుకు 135 మెగావాట్ల సామర్థ్యం గల 4 విద్యుత్ మోటార్లను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఆ మోటార్లను ప్రారంభించనున్నారు. దీంతో లక్ష్యా పది వేల ఎకరాలు సాగులోకి రానుంది.
రెండు, మూడు రోజుల్లో ఈ జలాశయంలోకి నీటిని విడుదల చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోన్నది. చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి ప్యాకేజీ – హెడ్ రెగ్యులేటర్ ద్వారా సొరంగంలోకి నీటి విడుదల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక్కడ నాలుగు ద్వారాలకు ఒక ద్వారాన్ని మంగళవారం 0. 2 మీటర్ల మేర పైకి ఎత్తడంతో సొరంగంలోని సర్జిపూల్‌లోకి గోదావరి నీళ్ల రాక షురూ అయ్యింది. బుధవారం ద్వారాన్ని 0. 8 మీటర్ల మేర ఎత్తడంతో నీటి ప్రవాహం మరింత పెరిగింది.
సొరంగంలో లీకేజీల పరిశీలన…
శ్రీరంగనాయక సాగర్ సొరంగం సర్జిపూల్ లో బుధవారం సాయంత్రం 5. 30 గంటల వరకు నీటి మట్టం 888 మీటర్లకు చేరింది. పలుమార్లు హెడ్ రెగ్యులేటర్ వద్ద ద్వారాన్ని మూసివేస్తూ సొరంగంలో లీకేజీలు ఏమైనా ఉన్నాయా ? అని పరిశీలించారు. జలాశయం సర్జిపూల్ లో 379 మీటర్ల మేర నీటి మట్టం ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నాలుగు పంపులతో ..
సర్జిపూల్ నుంచి పైప్ ద్వారా నీరు పంపింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. ఈ దశలోనూ లీకేజీలున్నాయా? అని అధికారులు పరిశీలిస్తున్నారు. సొరంగంలో పంప్ హౌజ్ నిర్మించారు. ఈ పంప్‌హౌజ్‌లో నాలుగు పంప్‌లను ఏర్పాటు చేశారు. వీటికి 185 మెగావాట్ల సామర్థ్యం కల్గిన మోటార్లు బిగించారు. 24 గంటల వ్యవధిలో ఒక్కో పంపు 0. 25 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్‌లోకి ఎత్తిపోయనుంది. అంటే ఈ పంపింగ్ కేంద్రం నుంచి నాలుగు పంప్‌ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని జలాశయంలోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నాలుగు పంపులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రంగనాయక సాగర్ లోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించడంలేదు. సర్జిపూల్ లోకి నీటి విడుదల అంశంపై రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. 3 టీఎంసీల సామర్థ్యంతో శ్రీ రంగనాయక సాగర్ జలాశయం నిర్మించారు. ఇది పూర్తిగా నిండితే సిద్దిపేట, దుబ్బాక, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
Tags: Siddipet district, Godavari waters, motors, CM KCR, Harish Rao