రేపు గోదావరి బోర్డు సమావేశం

దిశ, న్యూస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో భాగంగా శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లపైనే ప్రధాన చర్చ జరుగనుంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి […]

Update: 2020-06-04 10:39 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో భాగంగా శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లపైనే ప్రధాన చర్చ జరుగనుంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించింది. అయితే ఇక్కడ కూడా పాత ప్రాజెక్టులేనని, ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి పూర్తి చేస్తున్నామని బోర్డుకు వివరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై గురువారం నీటి పారుదల శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. గోదావరి బోర్డు సమావేశంలో వివరించాల్సిన అంశాలపై చర్చించారు.

Tags:    

Similar News