సేవ్ మొల్లెమ్ అంటున్న గోవా ప్రజలు

దిశ, వెబ్‌డెస్క్ : గోవాలోని ఓ గ్రామం గుండా రైల్వే ట్రాక్ వేసేందుకు సౌత్ వెస్టర్న్ రైల్వే సిద్ధమవడంతో.. ఒక్కసారిగా అక్కడ నిరసనలు మొదలయ్యాయి. ‘మిడ్ నైట్ ప్రొటెస్ట్’కు ఎన్విరాన్మెంటలిస్ట్ గ్రూప్స్ పిలుపునివ్వడంతో.. గోవా ప్రజలు కొవ్వొత్తులతో రొడ్డెక్కారు. 3 వేల మందికి పైగా గోవా ప్రజలు గోవా ఆన్సియంట్ కేపిటల్ చండోర్‌లోని ‘నొస్స సెన్హోరా డి బెలెమ్ చర్చ్’ స్క్వేర్ వద్ద కొవ్వొత్తులతో గుమిగూడారు. నిద్రాహారాలు మాని ఉదయం వరకు చండోర్‌లో వేస్తున్న రైల్వే ట్రాక్స్ […]

Update: 2020-11-04 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
గోవాలోని ఓ గ్రామం గుండా రైల్వే ట్రాక్ వేసేందుకు సౌత్ వెస్టర్న్ రైల్వే సిద్ధమవడంతో.. ఒక్కసారిగా అక్కడ నిరసనలు మొదలయ్యాయి. ‘మిడ్ నైట్ ప్రొటెస్ట్’కు ఎన్విరాన్మెంటలిస్ట్ గ్రూప్స్ పిలుపునివ్వడంతో.. గోవా ప్రజలు కొవ్వొత్తులతో రొడ్డెక్కారు. 3 వేల మందికి పైగా గోవా ప్రజలు గోవా ఆన్సియంట్ కేపిటల్ చండోర్‌లోని ‘నొస్స సెన్హోరా డి బెలెమ్ చర్చ్’ స్క్వేర్ వద్ద కొవ్వొత్తులతో గుమిగూడారు. నిద్రాహారాలు మాని ఉదయం వరకు చండోర్‌లో వేస్తున్న రైల్వే ట్రాక్స్ వద్దనే ఉండి సైలెంట్‌గా తమ నిరసన తెలియజేశారు. ఇంతకీ వాళ్ల నిరసనకు కారణమేంటి ? ట్రాక్స్ వేయడం వల్ల ఏంటి నష్టం?

అదానీ, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత గ్రూప్స్.. గోవా నుంచి 51.6 టన్నుల కోల్‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఏడాదికి 137 మిలియన టన్నుల బొగ్గును అక్కడి నుంచి రవాణా చేసేందుకు గోవా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తో్ంది. అందులో భాగంగానే రైల్వే ట్రాకులు నిర్మిస్తోంది. ఇందు కోసం అక్కడ ఎన్నో చెట్లను నరికివేస్తుండటంతో ఎన్విరాన్మెంట్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని ఓ వైపు పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గోవా తీరం.. చేపలు, నదులు, గ్రామాలు, వెస్టర్న్ ఘాట్స్, అడవులన్నీ కూడా నాశనమవుతాయని.. ఇది పర్యావరణానికి, జీవకోటికి అంత మంచిది కాదని గోవా ప్రజలు సూచిస్తున్నారు. కోల్‌ను తరలించడం వల్ల ఎకలాజికల్ డైవర్సిటీ నాశనం కావడం తమకు ఇష్టం లేదని, వెంటనే ఈ ట్రాన్స్‌పోర్ట్ ఆపాలని నిరసనకారులు తమ నిరసన తెలియజేశారు. ఈ మేరకు బొగ్గును తరలిస్తున్న పలు రైళ్లను అడ్డుకున్నారు.

కోల్ తరలించడంతో పాటు అక్కడ సరికొత్తగా చేపట్టిన ఎన్‌హెచ్4ఏ, రైల్వే డబుల్ ట్రాక్, ట్రాన్స్‌మిషన్ లైన్‌లకు వ్యతిరేకంగా గోవా ప్రజలు ఈ నిరసనను తెలియజేశారు. ‘ఈ భూమి నాశనం చేసేందుకు కాదు. మనం దీన్ని రక్షించుకోవాలి. మేము కాలుష్యాన్ని యాక్సెప్ట్ చేయం, కోల్ ట్రాన్స్‌పోర్టింగ్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల 70 వేల చెట్లు నేలకొరగుతాయి’ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘సేవ్ మొల్లెమ్, సేవ్ వెస్టర్న్ ఘాట్స్’ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News