‘సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని.. న్యాయం చేయాలి’

దిశ, న్యూస్‌బ్యూరో: వైద్య విద్య అడ్మిషన్‌లలో జీవో 43 సవరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కేసీఆర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టీస్ వంగాల ఈశ్వరయ్యలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు జరిగిన […]

Update: 2020-06-02 10:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: వైద్య విద్య అడ్మిషన్‌లలో జీవో 43 సవరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కేసీఆర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టీస్ వంగాల ఈశ్వరయ్యలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జీవో 43 సవరిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏపీ సీఎం జీవో 43ను సవరించి జీవో 57తీసుకువచ్చారని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లకు తూట్లు పోడుస్తుందని మండిపడ్డారు. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. మంగళవారం రెండో విడత కౌన్సింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని రెండో విడత కౌన్సిలింగ్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News