అవును వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ ?

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెళ్లిపై ఎన్నో కలలుకన్నారు. వీరి కలలను విధి వెక్కిరించింది. ప్రియుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తంలో వెలుగులోకి వచ్చింది. గ్రామనత్తం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఆత్మకూరు ప్రాంతంలో విద్యుత్‌ లైన్‌ కనెక్షన్‌ ఇవ్వబోతుండగా షాక్‌ కొట్టింది. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే […]

Update: 2021-08-14 08:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెళ్లిపై ఎన్నో కలలుకన్నారు. వీరి కలలను విధి వెక్కిరించింది. ప్రియుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తంలో వెలుగులోకి వచ్చింది. గ్రామనత్తం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఆత్మకూరు ప్రాంతంలో విద్యుత్‌ లైన్‌ కనెక్షన్‌ ఇవ్వబోతుండగా షాక్‌ కొట్టింది. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు తట్టుకోలేకపోయింది. శ్రీకాంత్ లేని జీవితం తాను ఊహించుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

 

Tags:    

Similar News