ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా..
దిశ, వెబ్ డెస్క్: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని గత మూడ్రోజులుగా ప్రియుడి ఇంటి ఎదుటే బైఠాయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. రమేష్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు న్యాయం చేయాలని, అతనితో పెళ్లి జరిపించాలని మూడ్రోజులుగా నిరసన తెలుపుతున్నా ఎవరూ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని గత మూడ్రోజులుగా ప్రియుడి ఇంటి ఎదుటే బైఠాయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితురాలి కథనం ప్రకారం.. రమేష్ అనే వ్యక్తి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పుడు మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు న్యాయం చేయాలని, అతనితో పెళ్లి జరిపించాలని మూడ్రోజులుగా నిరసన తెలుపుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. కనీసం అధికారులు, పోలీసులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె వెల్లడించింది. అయితే, బాధిత యువతికి అండగా ఆమె బంధువులు, మహిళా సంఘాల నేతలు నిలిచారు. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధిత యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది.