కేపీహెచ్‌బీలో చిట్టమ్మ మిస్సింగ్..

దిశ, కూకట్‌పల్లి : మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. శ్రీరాంనగర్​కాలనీకి చెందిన వై.సారయ్య కూతురు వై.చిట్టమ్మ(24) మంగళవారం కేపీహెచ్​బీకాలనీ జేఎన్‌టీయూ సమీపంలోని షాపులో పనుందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చిట్టమ్మ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి సారయ్య కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. […]

Update: 2021-08-17 11:06 GMT

దిశ, కూకట్‌పల్లి : మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. శ్రీరాంనగర్​కాలనీకి చెందిన వై.సారయ్య కూతురు వై.చిట్టమ్మ(24) మంగళవారం కేపీహెచ్​బీకాలనీ జేఎన్‌టీయూ సమీపంలోని షాపులో పనుందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చిట్టమ్మ కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి సారయ్య కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News