చిన్నారిని బలిగొన్న సంపు
దిశ, రంగారెడ్డి: శంషాబాద్ పట్టణంలోని హుడా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల వయసున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామానికి చెందిన లక్ష్మీ శేఖర్ దంపతులు హుడా కాలనీలో ఉంటున్నారు. వీరికి తేజశ్రీ, నిత్యశ్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం భార్యాభర్తలు కూలీ పనికి వెళ్లారు. సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న క్రమంలో నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. స్థానికులు […]
దిశ, రంగారెడ్డి: శంషాబాద్ పట్టణంలోని హుడా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల వయసున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ గ్రామానికి చెందిన లక్ష్మీ శేఖర్ దంపతులు హుడా కాలనీలో ఉంటున్నారు. వీరికి తేజశ్రీ, నిత్యశ్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం భార్యాభర్తలు కూలీ పనికి వెళ్లారు. సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న క్రమంలో నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. స్థానికులు గమనించి చిన్నారిని బయటకు తీసేలోపే మృతి చెందింది. కూలీ పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు నిత్యశ్రీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇంటి యజమాని నీటి సంపుపై మూత ఏర్పాటు చేయని కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని చిన్నారి తండ్రి శేఖర్ వాపోయాడు.