Raj Bhavan: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు.

Update: 2024-11-06 14:35 GMT
Raj Bhavan: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌(Raj Bhavan)కు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. కాగా, గతకొన్ని రోజులుగా జిష్ణుదేవ్ వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం.. మంత్రులతో కలిసి వెళ్లి గవర్నర్‌(Governor)ను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీలు బలరాం నాయక్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్‌ భవన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వే తీరును గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కుల గణన, మూసీ ప్రక్షాళనపై గవర్నర్‌తో చర్చించారు. పేదలు నష్టపోకుండా పరిహారం అందించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చినట్లు గవర్నర్‌కు చెప్పారు.

Tags:    

Similar News