భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం
దిశ, న్యూస్‌బ్యూరో: శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎస్‌ఆర్‌డీపీ కింద నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వయా సైదాబాద్, ఐ.ఎస్.సదన్ ద్వారా ఓవైసీ జంక్షన్ వరకు రూ. 523 కోట్ల 37లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఈనెల 23న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారిడార్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎస్‌ఆర్‌డీపీ కింద నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వయా సైదాబాద్, ఐ.ఎస్.సదన్ ద్వారా ఓవైసీ జంక్షన్ వరకు రూ. 523 కోట్ల 37లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఈనెల 23న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో ఫ్లైఓవర్ పొడవు 2.580 కిలోమీటర్లు కాగా మిగిలినది రెండు వైపులా ర్యాంప్‌లని, రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా నాలుగు లేన్లతో ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
24నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారిడార్ నిర్మాణంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. చంచల్‌గూడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్, దోబిఘాట్ జంక్షన్, ఐ.ఎస్.సదన్ జంక్షన్లలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య తొలుగుతుందని తెలిపారు. ఈ మార్గంలో 2015లో నిర్వహించిన సర్వేలో అత్యంత రద్దీ సమయంలో రోజుకు 70,576 వాహనాలు ప్రయాణించాయి. 2035 నాటికి ఈ రద్దీ దాదాపు రోజుకు 2లక్షల వాహనాల వరకు ఉంటుందని అంచనా. ఈ కారిడార్ నిర్మాణంతో వాహనదారులకు లబ్ది చేకూరుతుంది.