జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంపింగ్ యార్డ్‌పై మేయ‌ర్ చర్చ

దిశ, న్యూస్‌బ్యూరో: జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించిన అంశాలపై జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ..జవహర్ నగర్ ప్ర‌జాప్ర‌తినిధులు వివ‌రించిన స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించేందుకు త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, దుర్వాసన తగ్గించేందుకు డంపింగ్ చెత్త‌పై రెగ్యుల‌ర్‌గా స్ప్రేయింగ్ చేయాల‌ని రాంకీ సంస్థ‌కు సూచించారు.జీహెచ్ఎంసీ ద్వారా హెల్త్ కాంపులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు […]

Update: 2020-05-27 10:36 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:
జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించిన అంశాలపై జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ..జవహర్ నగర్ ప్ర‌జాప్ర‌తినిధులు వివ‌రించిన స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించేందుకు త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, దుర్వాసన తగ్గించేందుకు డంపింగ్ చెత్త‌పై రెగ్యుల‌ర్‌గా స్ప్రేయింగ్ చేయాల‌ని రాంకీ సంస్థ‌కు సూచించారు.జీహెచ్ఎంసీ ద్వారా హెల్త్ కాంపులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మేయ‌ర్ చెప్పుకొచ్చారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు జీహెచ్ఎంసి ద్వారా చేతి పంపులు, స్ప్రేయింగ్ యంత్రాల‌ను, మెటీరియ‌ల్‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.ఈ స‌మావేశంలో జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మేయ‌ర్ మేక‌ల కావ్య‌, డిప్యూటీ మేయ‌ర్ ఆర్‌.శ్రీ‌నివాస్‌, ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప్ర‌ణిత‌ గౌడ్‌, డిప్యూటీ ఛైర్మ‌న్ న‌రేంద‌ర్‌రెడ్డి, ఈవీడీఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, జీహెచ్‌ఎంసీ శానిటేష‌న్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్ రాజ్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ బి.శ్రీ‌నివాస్‌రెడ్డి, రాంకీ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌సూద్ మ‌ల్లిక్‌, ప్రాజెక్ట్ హెడ్ టి.కృష్ణారావు, మేనేజ‌ర్ ఆర్‌.సుధాక‌ర్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జి.శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News