క్వారెంటైన్‌లో గ్రేటర్ ప్రథమ పౌరుడు

దిశ, న్యూస్‌బ్యూరో గతంలో చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హోం క్వారెంటైన్ పాటించక తప్పడం లేదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి సొంతింట్లో గురువారం నుంచి హోం క్వారైంటైన్‌కు వెళ్లిపోయారు. తాజాగా మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మేయర్ కుటుంబం క్వారంటైన్ పాటిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ పేషీలోని అటెండర్‌కు కూడా రెండ్రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. పది రోజుల కిందట […]

Update: 2020-06-11 11:07 GMT

దిశ, న్యూస్‌బ్యూరో
గతంలో చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హోం క్వారెంటైన్ పాటించక తప్పడం లేదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి సొంతింట్లో గురువారం నుంచి హోం క్వారైంటైన్‌కు వెళ్లిపోయారు. తాజాగా మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మేయర్ కుటుంబం క్వారంటైన్ పాటిస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ పేషీలోని అటెండర్‌కు కూడా రెండ్రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. పది రోజుల కిందట మేయర్ వెళ్లిన హోటల్‌లోని వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న మేయర్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసిన అందరూ హోం క్వారెంటైన్ పాటించాల్సి ఉన్నా.. మేయర్ నిత్యం నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. జూన్ 4న నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ, సికింద్రాబాద్ బస్ టెర్మినల్ కోసం ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ మేయర్ పాల్గొన్నారు. మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో బల్దియా అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మేయర్‌తో సంబంధమున్న ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మేయర్‌లో లక్షణాలు బయట పడలేదేమోననే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మేయర్ పలు పర్యటనలు, సమావేశాల్లో పాల్గొనడంతో వారికి ఇప్పుడు భయం పట్టుకుంది. అందుకే మేయర్ కుటుంబంతో సహా హోం క్వారెంటైన్ పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చునని తెలుస్తోంది. గ్రేటర్ ప్రథమ పౌరుడితోనే కరోనా వైరస్ ఓ ఆట ఆడుకుంటుందంటే..మరి సామాన్య పౌరుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందోననే విషయం స్పష్టంగా తెలిసి వస్తోంది. మేయర్‌కే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక తమను ఎవరు రక్షిస్తారనే భయం గ్రేటర్ ప్రజలకు పట్టుకుందని తెలుస్తోంది.

Tags:    

Similar News