‘గీతం’యాజమాన్యానికి చుక్కెదురు!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని గీతం యాజమాన్యం అప్పీల్‌కు వెళ్లగా .. ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, మీరు ఏం చెప్పాలని అనుకున్నా అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది. ఇదిలాఉండగా, ప్రభుత్వ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకుని చేపట్టిన గీతం యూనివర్సిటీ నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం కూల్చివేయించిన విషయం తెలిసిందే. అంతకుముందు సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని గీతం యాజమాన్యం అప్పీల్‌కు వెళ్లగా .. ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, మీరు ఏం చెప్పాలని అనుకున్నా అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది.
ఇదిలాఉండగా, ప్రభుత్వ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకుని చేపట్టిన గీతం యూనివర్సిటీ నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం కూల్చివేయించిన విషయం తెలిసిందే. అంతకుముందు సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది.