ఫస్ట్ నైట్ రోజే భార్యకు షాక్.. తన బాయ్ ఫ్రెండ్ తో సంసారం చేయాలని భర్త ఆఫర్
దిశ ఏపీ బ్యూరో: 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకున్న మరుసటి రోజే షాకిచ్చాడో ఓ ఎన్నారై.. ఘటన వివరాల్లోకి వెళ్తే… గుంటూరు పట్టణానికి చెందిన యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో వధువు కుటుంబం ఘనంగా కట్నకానుకల ఇచ్చి వివాహం జరిపించారు. మొదటి రాత్రి ముహూర్తం నుంచి నాలుగు రోజులపాటు ఏవో కారణాలు చెబుతున్న యువకుడ్ని నాలుగోరోజు యువతి గట్టిగా నిలదీసింది. దీంతో తాను గేనని చెప్పాడు. అమెరికాలో […]
దిశ ఏపీ బ్యూరో: 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకున్న మరుసటి రోజే షాకిచ్చాడో ఓ ఎన్నారై.. ఘటన వివరాల్లోకి వెళ్తే… గుంటూరు పట్టణానికి చెందిన యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో వధువు కుటుంబం ఘనంగా కట్నకానుకల ఇచ్చి వివాహం జరిపించారు. మొదటి రాత్రి ముహూర్తం నుంచి నాలుగు రోజులపాటు ఏవో కారణాలు చెబుతున్న యువకుడ్ని నాలుగోరోజు యువతి గట్టిగా నిలదీసింది. దీంతో తాను గేనని చెప్పాడు.
అమెరికాలో నాలుగేళ్ళుగా బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నానని, రేపు భార్యను తీసుకెళ్లిన తరువాత తన బాయ్ ఫ్రెండ్‌తోనే కాపురం చేయాలని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి బిత్తరపోయింది. లబోదిబోమంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, విషయం వివరించింది. దీంతో వారు వచ్చి వరుడి తల్లిదండ్రుల్ని నిలదీయడంతో బంధువులతో కలిసి వధువు కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది.