స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్..నలుగురు మృతి
దిశ,వెబ్‌డెస్క్: ఒడిశాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్టీల్ ప్లాంట్‌లోని ఓ యూనిట్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా విషవాయువులు లీకైనట్టుగా అధికారులు గుర్తించారు. కాగా ఈ గ్యాస్‌ను పీల్చి నలుగురు కార్మికులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. స్పృహ కోల్పోయి పడిపోయిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. […]
దిశ,వెబ్‌డెస్క్: ఒడిశాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. స్టీల్ ప్లాంట్‌లోని ఓ యూనిట్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా విషవాయువులు లీకైనట్టుగా అధికారులు గుర్తించారు. కాగా ఈ గ్యాస్‌ను పీల్చి నలుగురు కార్మికులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. స్పృహ కోల్పోయి పడిపోయిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. వారిలో చికిత్స పొందుతూ నలుగురు కార్మికులు మరణించారు.
మరికొందరు కార్మికులను ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకుని అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే కోల్ కెమికల్ సైట్‌లోని సేఫ్టీ వాల్వ్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ఘటన సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.