గ్యాస్ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలి
దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్‌పీజీ గ్యాస్ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి వారికి వ్యాక్సినేషన్ అందించాలని తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రీబ్యూటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలువురు సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారని, ఇంకొంతమందికి వైరస్ వ్యాప్తి చెందకముందే వారికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నెలరోజుల్లో ఏడుగురు డిస్ట్రీబ్యూటర్లు సహా 13 మందిని కోల్పోయినట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్‌పీజీ గ్యాస్ డెలివరీ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి వారికి వ్యాక్సినేషన్ అందించాలని తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రీబ్యూటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలువురు సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారని, ఇంకొంతమందికి వైరస్ వ్యాప్తి చెందకముందే వారికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నెలరోజుల్లో ఏడుగురు డిస్ట్రీబ్యూటర్లు సహా 13 మందిని కోల్పోయినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ డెలివరీ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నారని, తెలంగాణలోనూ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే గ్యాస్ డెలివరీ చేసేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు.