వైరస్ కణాలను తగ్గిస్తున్న.. మౌత్‌వాష్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నిరోధించడానికి భారతీయులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆవిరి పట్టడం, ఇమ్యూనిటీ బూస్టర్ల వాడకం, కషాయాలను తాగడంతో పాటు యోగా, ధ్యానం, వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వైద్యవిధానాలను, నాటు పద్ధతులను అవలంబిస్తున్నారు. ఏదో ఒక పద్ధతిలో తమకు ఉపశమనం లభిస్తుందనేది వారి నమ్మకం. అయితే, వీటిలో కొన్ని పద్ధతుల వల్ల కాస్త ఊరట లభిస్తున్నట్లు పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. తాజాగా మౌత్ ఫ్రెష్‌నర్‌తోనూ కరోనా వైరస్‌కు కొంతమేరకు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నిరోధించడానికి భారతీయులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆవిరి పట్టడం, ఇమ్యూనిటీ బూస్టర్ల వాడకం, కషాయాలను తాగడంతో పాటు యోగా, ధ్యానం, వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వైద్యవిధానాలను, నాటు పద్ధతులను అవలంబిస్తున్నారు. ఏదో ఒక పద్ధతిలో తమకు ఉపశమనం లభిస్తుందనేది వారి నమ్మకం. అయితే, వీటిలో కొన్ని పద్ధతుల వల్ల కాస్త ఊరట లభిస్తున్నట్లు పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. తాజాగా మౌత్ ఫ్రెష్‌నర్‌తోనూ కరోనా వైరస్‌కు కొంతమేరకు చెక్ పెట్టొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా వైరస్ సోకినవారి గొంతులో అధిక మొత్తంలో వైరస్‌లు జీవిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కిలించడం వల్ల వైరస్ కణాల సంఖ్య తగ్గుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇతరులకు కొవిడ్ 19 సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మౌత్‌వాష్‌ను వైరస్ కణాలతో కలిపారు. నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత చూస్తే.. వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
మొత్తంగా 8 రకాల మౌత్‌వాష్‌లతో ఈ అధ్యయనం చేపట్టగా, అన్నింటినీ వైరస్ పార్టికల్స్‌తో కలిపారు. సృష్టించిన సెలైవాతో పరీక్షించి చూశారు. వీటిలో దాదాపు అన్ని మౌత్‌వాష్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని, మూడు రకాలైతే పూర్తిగా వైరస్‌ను తొలిగించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే నోరు పుక్కిలింత తర్వాత ఎంత సమయం వరకు వీటి ఎఫెక్ట్ ఉంటుందని తెలియదన్నారు. అయితే, పరిశోధకుల ప్రకారం కొవిడ్ 19ను ట్రీట్ చేయడానికి మౌత్ వాష్‌లు సరికావని తెలిపారు.