అక్షరాస్యత ఫస్ట్ ప్రియారిటీ: గంగుల

అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణ అక్షరాస్యతలో వెనకబడి ఉండడం సరి కాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన జడ్పీ మీటింగ్‌కు ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంచేందుకు సీరియస్‌గా పని చేయాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అక్షరాస్యత పెంచేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల అభివృద్ధి నిధుల నుంచి 20 శాతం నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చించేలా జడ్పీలో తీర్మానం చేయాలని […]

Update: 2020-02-19 04:50 GMT

అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణ అక్షరాస్యతలో వెనకబడి ఉండడం సరి కాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన జడ్పీ మీటింగ్‌కు ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంచేందుకు సీరియస్‌గా పని చేయాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అక్షరాస్యత పెంచేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల అభివృద్ధి నిధుల నుంచి 20 శాతం నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చించేలా జడ్పీలో తీర్మానం చేయాలని గంగుల కమలాకర్ సూచించారు.

Tags:    

Similar News