మూత్ర విసర్జనకు వెళ్లిన గర్భిణిపై గ్యాంగ్ రేప్.. గర్భంలోనే శిశువు మృతి
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా, ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తోన్నా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. కామంతో రగిలిపోయి కొందరు, పగపెంచుకొని మరికొందరు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు, పెద్దాచిన్నా, కొన్నిసార్లు మానవత్వాన్ని కూడా మరిచి మృగాళ్లు ప్రవర్తించే తీరు సమాజానికి సిగ్గుచేటుగా మారింది. తాజాగా ఒక గర్భిణీ పై నలుగురు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా, ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తోన్నా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. కామంతో రగిలిపోయి కొందరు, పగపెంచుకొని మరికొందరు ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు, పెద్దాచిన్నా, కొన్నిసార్లు మానవత్వాన్ని కూడా మరిచి మృగాళ్లు ప్రవర్తించే తీరు సమాజానికి సిగ్గుచేటుగా మారింది. తాజాగా ఒక గర్భిణీ పై నలుగురు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
వివరాలలోకి వెళితే.. ఔరైయా జిల్లా మియాపూర్ ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీ, కుటుంబంతో నివాసముంటోంది. ఇక ఈ నేపథ్యంలోనే వారి ఇంటివద్ద ఉన్న డ్రైనేజ్ విషయంలో నలుగురు వ్యక్తులకు, ఆమెకు గొడవ జరిగింది. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపైనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మహిళపై ఆ నలుగురు వ్యక్తులు పగపెంచుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 28 న మహిళ మలవిసర్జన కోసం బయటికి రాగా.. అక్కడే కాపుకాసి ఆ నలుగురు ఆమెను కిడ్నాప్ చేసి గ్రామం చివర్లో ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో దాచారు.
అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. తాను గర్భిణీ అని ఆమె ఎంత చెప్పినా వినకుండా నరరూప రాక్షసులుగా ఆమెను లొంగదీసుకున్నారు. ఇక ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు పాడుబడిన ఇంటికి వెళ్లి చూడగా మహిళ కడుపునొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. వెంటనే మహిళను ఆసుపత్రికి తరలించగా మహిళా ఐదునెలల మృత శిశువును ప్రసవించింది. సామూహిక ఆత్యాచారం జరగడం వలనే శిశువు మృతిచెందినదని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది.