నిమజ్జనం వేళ చిన్నారుల గణపయ్య.. వెళ్లి రావయ్యా.. వైరల్‌ అవుతున్న వీడియో

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వినాయక చవితి వస్తుందంటే చాలు చిన్నారుల ఆనందాలకు అవధులే ఉండవు. చందాలు వసూలు మొదలుకొని వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం, ఆ విగ్రహం ముందు ఆటపాటలతో కోలాహలం చేయడం.. ఆనందాలతో కేరింతలు కొట్టడం చిన్నారులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. నృత్యాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ, రంగులు పూసుకోవడం ఒకటేమిటి ప్రతీది వారికే ఆనందమే. విగ్రహాలకు పెద్దలు పూజలు చేసి ముగ్గులు ఆర్భాటాలు.. మేళతాళాలు.. బాజా భజంత్రీల మధ్య ఊరేగింపు సాగుతుంది.. అందుకు […]

Update: 2021-09-18 23:36 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వినాయక చవితి వస్తుందంటే చాలు చిన్నారుల ఆనందాలకు అవధులే ఉండవు. చందాలు వసూలు మొదలుకొని వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం, ఆ విగ్రహం ముందు ఆటపాటలతో కోలాహలం చేయడం.. ఆనందాలతో కేరింతలు కొట్టడం చిన్నారులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. నృత్యాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ, రంగులు పూసుకోవడం ఒకటేమిటి ప్రతీది వారికే ఆనందమే.

విగ్రహాలకు పెద్దలు పూజలు చేసి ముగ్గులు ఆర్భాటాలు.. మేళతాళాలు.. బాజా భజంత్రీల మధ్య ఊరేగింపు సాగుతుంది.. అందుకు తామేమీ తీసిపోము అన్నట్లుగా చిన్నారులు పాత డబ్బాలు.. ఇనుప సామానులను ఉపయోగించుకొని పెద్దలు ఉపయోగించే బాజాభజంత్రీలకు ధీటుగా ఢంకా బజాయిస్తూ.. చిన్ని సైకిల్‌ను వినాయకుడి ఊరేగింపు వాహనంగా చేసుకుని నిమజ్జనానికి తరలిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News