అది మా వద్ద పెండింగ్‌లో లేదు: గజేంద్రసింగ్ షెకావత్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన డీపీఆర్ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 జనవరి 20లోపు అందిన ఏ డీపీఆర్ కూడా పెండింగ్‌లో లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చారు. 2009 జనవరి 20 తర్వాత కేంద్రం వద్దకు ఏపీ నుంచి ఏడీపీఆర్ రాలేదని చెప్పుకొచ్చారు. 2005-06 ధరల ప్రకారం రూ. 10,151.04 కోట్ల అంచనాతో రూపొందించిన డీపీఆర్‌ను బహుళార్థసాధక […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన డీపీఆర్ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 జనవరి 20లోపు అందిన ఏ డీపీఆర్ కూడా పెండింగ్‌లో లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చారు. 2009 జనవరి 20 తర్వాత కేంద్రం వద్దకు ఏపీ నుంచి ఏడీపీఆర్ రాలేదని చెప్పుకొచ్చారు. 2005-06 ధరల ప్రకారం రూ. 10,151.04 కోట్ల అంచనాతో రూపొందించిన డీపీఆర్‌ను బహుళార్థసాధక ప్రాజెక్టులకు సంబంధించిన సలహా సంఘం 2009 జనవరి 20న జరిగిన 95వ సమావేశంలో ఆమోదించిందని మంత్రి వెల్లడించారు. అయితే ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.