టోల్ కష్టాలు.. నగరం బాట పట్టిన జనాలు

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లిన జనాలు తిరిగి నగరం బాట పడుతున్నారు. పండుగ సెలవులు పూర్తవడంతో తిరిగి తమ రెగ్యూలర్ లైఫ్‌ను కొనసాగించేందుకు హైదరాబాద్‌ బాట పట్టారు. ఏపీ, తెలంగాణలోని బొర్డర్ జిల్లా వాసులు తమ సొంత, ప్రైవేటు వాహనాల్లో రిటర్న్ జర్నీ చేస్తున్నారు. దీంతో చౌటుప్పల్‌లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలో మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు టోల్ […]

Update: 2021-01-17 20:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లిన జనాలు తిరిగి నగరం బాట పడుతున్నారు. పండుగ సెలవులు పూర్తవడంతో తిరిగి తమ రెగ్యూలర్ లైఫ్‌ను కొనసాగించేందుకు హైదరాబాద్‌ బాట పట్టారు. ఏపీ, తెలంగాణలోని బొర్డర్ జిల్లా వాసులు తమ సొంత, ప్రైవేటు వాహనాల్లో రిటర్న్ జర్నీ చేస్తున్నారు. దీంతో చౌటుప్పల్‌లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.

కిలో మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. విలేజ్ నుంచి నేరుగా ఆఫీసులకు అందాలని తెల్లవారు జామున బయలుదేరిన వారికి టోల్ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. అంతేకాకుండా రోడ్లపై పొగ మంచు కమ్ముకోవడం కూడా వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News