ఏపీ తీరప్రాంతాల్లో హై అలర్ట్.. మత్స్యకారులకు హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీంతో నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. తీర ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు […]

Update: 2021-07-11 01:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీంతో నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు సమాచారం. తీర ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తులశాఖ కమిషనర్ హై అలర్ట్ ప్రకటించారు.

Tags:    

Similar News