తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
దిశ, ఏపీబ్యూరో: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన కుండపోత వానలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఓ గంటసేపు జడివాన కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఈ అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడటం వల్ల తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశమున్నట్లు పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం […]
దిశ, ఏపీబ్యూరో: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన కుండపోత వానలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఓ గంటసేపు జడివాన కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఈ అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడటం వల్ల తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశమున్నట్లు పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.